News June 12, 2024
చిరంజీవిని హత్తుకున్న సీఎం చంద్రబాబు(PHOTOS)

AP: తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు వీడ్కోలు పలికారు. స్వయంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన CBN మెగాస్టార్‌ను ప్రేమగా హత్తుకున్నారు. అనంతరం రామ్‌చరణ్, చిరంజీవి సతీమణి సురేఖలతో కాసేపు ముచ్చటించారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు CM ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News October 31, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసేటప్పుడు చెట్ల కింద ఉండరాదని సూచించింది. అటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని IMD తెలిపింది. కాగా ఇవాళ దాదాపు అన్ని జిల్లాల్లో పొడివాతావరణం కనిపించింది. అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిశాయి.
News October 31, 2025
తక్షణమే సాయం చేయండి.. కేంద్రానికి ఏపీ నివేదిక

AP: మొంథా తుఫాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. 1.38L హెక్టార్లలో పంట నష్టం, 2.96L మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని తెలిపింది. ‘249 మండలాల పరిధిలో 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై ప్రభావం పడింది. రైతులకు ₹829Cr నష్టం వచ్చింది. రోడ్లు, విద్యుత్ సహా 17 రంగాల్లో ₹5,244Cr నష్టం వాటిల్లింది. పరిశీలనకు కేంద్ర బృందాలను పంపి తక్షణమే సాయం అందించాలి’ అని కోరింది.
News October 31, 2025
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) ఆస్పత్రిలో చేరారు. మెడికల్ చెకప్ కోసం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు ఇండియా టుడే తెలిపింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా ఏప్రిల్‌లో ధర్మేంద్ర కంటికి సర్జరీ జరిగింది. ఈ దిగ్గజ నటుడు షోలే, చుప్కే చుప్కే, అనుపమ, సీతా ఔర్ గీతా, ధర్మవీర్, జీవన్ మృత్యు లాంటి 300కు పైగా సినిమాల్లో నటించారు.


