News June 12, 2024

HSBD: వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం

image

జీహెచ్ఎంసీ కార్యాలయంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ ఇన్‌ఛార్జి కమిషనర్ అమ్రపాలి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంగా చేసి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

Similar News

News October 4, 2024

జగిత్యాల: ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 14 రోజుల రిమాండ్

image

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పోక్సో కేసులో 14 రోజుల రిమాండ్‌ను మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జితేందర్ విధించారు. ఓ ఉపాధ్యాయుడు కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి గురువారం రాత్రి జగిత్యాల సబ్ జైలుకు అతడిని తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు.

News October 4, 2024

కరీంనగర్: రూ.17.88 కోట్ల బకాయిలు!

image

కరీంనగర్ జిల్లాలోని పలు మహిళా సంఘాలు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు ఉపాధితో పాటు ఇతర అవసరాలకు రుణాలు వినియోగించుకుంటున్నారు. కొందరు చెల్లించలేకపోవడంతో వడ్డీ, అసలు కలిపి భారంగా మారుతున్నాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నగర, పురపాలికల్లో వేల సంఖ్యలో స్వశక్తి సంఘాలు పనిచేస్తున్నాయి. రుణం చెల్లించని సంఘాలు 576 ఉండగా, రూ.17.88 కోట్ల బకాయిలు ఉన్నాయి.

News October 4, 2024

పెద్దపల్లి: టెన్త్ విద్యార్థి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కంటే చిన్నా(15) అనే పదో తరగతి విద్యార్థి వైరల్ ఫీవర్‌తో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే గత పదిరోజులుగా చిన్నా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో రెండు కిడ్నీల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.