News June 12, 2024

ఎమ్మెల్యే పదవికి అఖిలేశ్ రాజీనామా

image

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కన్నౌజ్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ఆయన ఎంపీగా కొనసాగుతానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఫైజాబాద్ ఎంపీగా గెలుపొందిన పార్టీ సీనియర్ నేత అవధేశ్ ప్రసాద్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను శాసనసభ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి పంపారు. ఇటీవల యూపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో SP 37 స్థానాలు గెలుచుకుంది.

Similar News

News January 31, 2025

తెలుగు నిర్మాత కన్నుమూత

image

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్(54) ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన HYDలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉన్న వేదరాజు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేశ్‌తో మడత కాజా, సంఘర్షణ చిత్రాలను నిర్మించారు. మరో మూవీకి సన్నాహాలు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది.

News January 31, 2025

పంచాయతీ ఎన్నికలు.. ఓటర్ల జాబితాపై SEC కీలక ఆదేశాలు

image

TG: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించింది. గత ఏడాది OCT 1 నుంచి DEC 31 వరకు జాబితా ఉండగా, ఫిబ్రవరి 3 వరకు సప్లిమెంటరీ లిస్టు రెడీ చేయాలని సూచించింది. ఓటర్ల తొలగింపు, చేర్పులపై ఫిబ్రవరి 4న స్థానిక రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించాలంది. ఫిబ్రవరి 6 నాటికి తుది జాబితాను ఖరారు చేయాలని పేర్కొంది.

News January 31, 2025

మరింత యంగ్‌గా కనిపించాలనుకుంటున్నారా?

image

మన జీవితంలో కొన్ని అలవాట్లు పాటిస్తే అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ తగినంత నీరు తాగాలి. మనం తినే ఆహారాన్ని (మైండ్‌ఫుల్ ఈటింగ్) ఆస్వాదిస్తూ తినాలి. కాసేపు స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి హాయిగా నవ్వుకోవాలి. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ప్రకృతిని ఆస్వాదించాలి. ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవాలి. రోజూ డాన్స్, యోగా, వ్యాయామం చేస్తే శరీరం చురుగ్గా పనిచేసి నిత్య యవ్వనంగా కనిపిస్తాం.