News June 12, 2024
మలయాళంలోకి సమంత ఎంట్రీ?

స్టార్ హీరోయిన్ సమంత మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన ఆమె నటిస్తారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పటివరకు మలయాళంలో సినిమా చేయలేదు.
Similar News
News September 12, 2025
మంచి భార్య అనిపించుకోవాలని..!

మంచి కోడలు, మంచి భార్య అనిపించుకోవాలని మహిళలు అత్తింట్లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. దాన్నే గుడ్‌వైఫ్ సిండ్రోం అంటారు. ప్రతి చిన్నవిషయానికీ సర్దుకుపోవడం, సంతోషాలు వదులుకోవడం దీని లక్షణాలు. కుటుంబం కోసం తమ ఫీలింగ్స్ తొక్కిపెట్టేస్తారు. దీంతో దీర్ఘకాలంలో డిప్రెషన్‌కు గురవుతారని నిపుణులు అంటున్నారు. ఇలాకాకుండా అర్థం చేసుకొనే భాగస్వామిని ఎంచుకొని స్వేచ్ఛగా, సంతోషంగా ఉండాలని సూచిస్తున్నారు.
News September 12, 2025
MOSతో క్లరికల్ ఉద్యోగాలు

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో క్లరికల్ కేడర్‌లో ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడే కోర్సు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్(MOS). దీని ద్వారా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తదితర బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ లభిస్తాయి. దీంతో SSC నిర్వహించే CHSL, MTS రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో విజయం సాధించవచ్చు. పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందిస్తున్నాయి.
News September 12, 2025
సంతానం పొందడానికి SMEP..

ప్రస్తుత కాలంలో చాలా జంటలు సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే పిల్లలు పుట్టకపోవడానికి లోపాలే కారణం అనుకుంటారు. కానీ అండం విడుదల సమయాన్ని గుర్తించలేకపోవడం కూడా ఒక కారణం. ఓవులేషన్ టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి కలయికలో పాల్గొంటే సక్సెస్ రేటు పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీన్నే స్పెర్మ్ మీట్ ఎగ్ ప్లాన్(SMEP) అంటారు. దీనికి అనుగుణంగా శృంగారంలో పాల్గొనడం వల్ల గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి.