News June 12, 2024

APలో రాక్షస పాలన: YCP నేత సుబ్బారెడ్డి

image

AP: జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని YCP నేత YV సుబ్బారెడ్డి విమర్శించారు. ‘2014 నుంచి 19 వరకు CBN ఇలాంటి పాలనే చేశారు. ప్లాన్ ప్రకారం YCP కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారు. కొన్నిచోట్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పోలీసులు పట్టించుకోవడంలేదు. ఈ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఆ తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని YVS వెల్లడించారు.

Similar News

News January 1, 2026

బాల భీముడు పుట్టాడు.. అదీ నార్మల్ డెలివరీ..

image

AP: అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ ఏకంగా 4.8 కేజీల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. అది కూడా నార్మల్ డెలివరీ కావడం విశేషం. పెందుర్తికి చెందిన మహిళకు సాధారణ ప్రసవంలో శిశువు తల మామూలుగానే బయటకు వచ్చినా భుజాలు రాకపోవడంతో సిజేరియన్ తప్పదేమోనని భావించారు. కానీ వైద్యులు 4 గంటల పాటు శ్రమించి సాధారణ కాన్పు చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లను మంత్రి సత్యకుమార్ అభినందించారు.

News January 1, 2026

రాగి ఆభరణాలతో చర్మ సంరక్షణ

image

రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. కొల్లాజెన్ ఉత్ప‌త్తిని పెంచడంలో రాగి ఆభ‌ర‌ణాలు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయని నిపుణులు చెబుతున్నారు. రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా త‌యార‌వుతుంది. చ‌ర్మంపై ముడ‌త‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం రంగు కూడా మెరుగుప‌డుతుంది. చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. య‌వ్వ‌నంగా ఉంటారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

News January 1, 2026

కొత్త సంవత్సరం.. ఇంటికి ఇవి తెచ్చుకుందామా?

image

కొత్త ఏడాదిలో అదృష్టం కోసం ఇంటికి శ్రీయంత్రం, వెండి నాణెం తేవాలని వాస్తు, జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. మనీ ప్లాంట్, తులసి మొక్కలు నాటాలని చెబుతున్నారు. ‘తాబేలు ప్రతిమ, దక్షిణామూర్తి చిత్రపటాన్ని పూజ గదిలో అమర్చాలి. కుబేర యంత్రం, గోమతి చక్రాలు కొనుగోలు చేసిన ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది’ అంటున్నారు. కొత్త ఏడాదిలో లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.