News June 12, 2024

సూపర్‌ఫాస్ట్‌గా పుంజుకున్నాయి..!

image

ఎన్నికల ఫలితాల ప్రభావం నుంచి స్టాక్ మార్కెట్లు శరవేగంగా కోలుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 4న 6% నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాతి మూడు సెషన్లలో ఆ నష్టాన్ని అధిగమించాయి. 5శాతం కంటే ఎక్కువ నష్టపోయి ఇంత త్వరగా కోలుకోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. లోకల్ స్టాక్స్‌పైన ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Similar News

News February 25, 2025

ఈ సింగర్ ఇద్దరు స్టార్ హీరోల చెల్లెలు తెలుసా?

image

సింగర్ బృంద.. తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీల సొంత చెల్లెలు. మిస్టర్ చంద్రమౌళి మూవీతో సింగర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె తర్వాత రాక్షసి, జాక్‌పాట్, పొన్‌మగల్ వంధాల్‌, ఓ2లో పాటలు పాడారు. తన వదిన, సూర్య భార్య జ్యోతిక నటించిన పొన్‌మగల్ వంధాల్‌లో బృంద పాడిన ‘వా చెల్లామ్’ సాంగ్ పెద్ద హిట్టయింది. ఇక రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ తమిళ వెర్షన్‌లో ఆలియాకు ఈమే డబ్బింగ్ చెప్పారు.

News February 25, 2025

హతవిధీ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..!

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే అతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్‌పై వరుస ఓటములతో ఆ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో ఓ ICC టోర్నీ జరుగుతోంది. కానీ ఆ ఆనందాన్ని ఆరు రోజులు కూడా ఆ దేశం నిలుపుకోలేకపోయింది. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. పాక్ ప్రదర్శనపై మీ కామెంట్.

News February 25, 2025

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 25)

image

* 1961- తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం
* 1974- సినీ నటి దివ్యభారతి జననం(ఫొటోలో)
* 1981- బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పుట్టినరోజు
* 1998- ఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానాన్ని ఆల్ ఇండియా రేడియో(ఆకాశవాణి) ప్రవేశపెట్టింది
* 2004- సినీ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి మరణం
* 2010- స్వాతంత్ర్య సమరయోధుడు కాటం లక్ష్మీనారాయణ మరణం

error: Content is protected !!