News June 12, 2024

ఈ నెల 24న కొలువుదీరనున్న లోక్‌సభ: కిరణ్ రిజిజు

image

ఈ నెల 24న 18వ లోక్‌సభ కొలువుదీరనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. జులై 3వరకు జరిగే సమావేశాల్లో నూతన సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ముఖ్య అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. 264వ రాజ్యసభ సెషన్ ఈ నెల 27న ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అదే రోజున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు.

Similar News

News December 24, 2024

భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు రూ.31 లక్షలు ఖర్చు!

image

భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని ఎవరిని అడిగినా చెబుతారు. అయితే, ఇది అబద్ధం అంటూ ఓ యూట్యూబర్ సవాల్ విసిరాడు. భూమి ఫ్లాట్‌గా ఉందని నిరూపించేందుకు యూట్యూబర్ జెరన్ కాంపనెల్లా ఏకంగా రూ.31 లక్షలు ఖర్చు చేసి అంటార్కిటికాలో యాత్ర ప్రారంభించాడు. ఈ ట్రిప్ పూర్తయ్యేలోపు తన వాదన తప్పనే విషయాన్ని గ్రహించాడు. భూమి గుండ్రంగానే ఉందంటూ క్షమాపణలు చెప్పాడు.

News December 24, 2024

పెన్షన్లపై సీఎం కీలక ఆదేశాలు

image

APలో పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు అనర్హులు ఉన్నారని CM చంద్రబాబు తెలిపారు. అర్హులకే పథకాలు, పెన్షన్లు ఇవ్వాలనేది తమ ఉద్దేశమని, ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం సరికాదన్నారు. అనర్హులను తొలగించేందుకు 3 నెలల్లోగా దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీలు పూర్తి చేయాలన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవన్నారు. అటు అర్హులైన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

News December 24, 2024

టెలికం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు

image

వాయిస్ కాల్స్, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని జియో, ఎయిర్‌టెల్, VI, BSNL సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. ప్రస్తుతం డేటా, కాల్స్, SMSలకు కలిపి ఈ సంస్థల ప్లాన్లు ఉన్నాయి. దీంతో డేటా అవసరం లేకున్నా ఫీచర్ ఫోన్లు వాడే వారు తప్పకుండా రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తోంది. 2 సిమ్‌లు వాడే వారూ ఒక నంబర్ వాడుకలో ఉండేలా రీఛార్జ్ చేసుకుంటూ నష్టపోతున్నారు. త్వరలో వీరి కష్టాలు తీరే అవకాశముంది.