News June 12, 2024
గర్భిణులు, బాలింతలకు బెయిల్ ఇవ్వాల్సిందే: HC

జైలులో ఉన్న గర్భిణులు, పాలిచ్చే బాలింతలకు ప్రసవం నుంచి ఏడాది వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు అభిప్రాయపడింది. NDPS Act కింద జైలుకెళ్లిన ఓ గర్భిణీ ఖైదీకి కోర్టు బెయిల్ ఇస్తూ ఇలా వ్యాఖ్యానించింది. ‘గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కావాల్సింది బెయిల్, జైల్ కాదు. తల్లి చేసిన నేరం వల్ల పిల్లలను బాధపెట్టకూడదు. జైలులో పుట్టడం వల్ల ఆ పిల్లలపై ప్రతికూలం ప్రభావం ఉంటుంది’ అని పేర్కొంది.
Similar News
News September 14, 2025
బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ

AP: మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత BJPలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఏడాది క్రితం YCPకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. TDP ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2017లో MLCగా ఎన్నికయ్యారు. ఆ పార్టీకి రాజీనామా చేసి 2020లో వైసీపీలో చేరి మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. పరిటాల రవి ముఖ్య అనుచరుడు పోతుల సురేశ్ ఈమె భర్త.
News September 14, 2025
పాక్‌తో మ్యాచ్‌కు BCCI దూరం!

భారత్, పాక్ మ్యాచ్‌కు BCCI అధికారులు దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. BCCI సెక్రటరీ సైకియా, IPL ఛైర్మన్ ధుమాల్, ట్రెజరర్ ప్రభ్‌తేజ్, జాయింట్ సెక్రటరీ రోహన్ దుబాయ్ వెళ్లేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం. అటు ICC ఛైర్మన్ జైషా USలో ఉన్నారు. ACC ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న BCCI సెక్రటరీ శుక్లా మాత్రమే మ్యాచ్ వీక్షించే అవకాశముంది. ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారనే కెెమెరా ముందుకు రావట్లేదని తెలుస్తోంది.
News September 14, 2025
దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు: లోకేశ్

AP: తన కుమారుడు దేవాన్ష్ ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నాడని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించాడని పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తాను పాల్గొన్నానని చెప్పారు. దేవాన్ష్ ముందు చూపు, ఆలోచనా శక్తి, ఒత్తిడిలో ప్రదర్శించిన సమయస్ఫూర్తి వల్లే ఈ విజయం సాధ్యమైందని లోకేశ్ వివరించారు.