News June 12, 2024
రేపటి నుంచి స్కూళ్లు.. విద్యార్థులకు ‘స్టూడెంట్ కిట్’ పంపిణీ

APలో రేపటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఇవాళే ప్రారంభం కావాల్సి ఉండగా CBN ప్రమాణ స్వీకారం నేపథ్యంలో టీచర్ సంఘాల విజ్ఞప్తితో ఇవాళ సెలవు ఇచ్చారు. రేపు స్కూళ్లలో ‘జగనన్న విద్యా కానుక’ను స్టూడెంట్ కిట్ పేరుతో విద్యార్థులకు అందించనున్నారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని PM-పోషణ్ గోరుముద్ద పేరుతో అమలు చేస్తారు.
Similar News
News November 7, 2025
సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా రివ్యూ

లంకె బిందెలకు కాపలా ఉండే ధన పిశాచి, ఓ ఘోస్ట్ హంటర్ చుట్టూ జరిగే కథే ‘జటాధర’ మూవీ. ఆడియన్స్ పేషన్స్‌ను టెస్ట్ చేసే సినిమా ఇది. స్టోరీలో బలం, కొత్త ధనం లేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏమాత్రం మెప్పించదు. అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ అంశాలు, BGM ఫర్వాలేదనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ ఇబ్బందిపెడుతుంది. సాగదీత, ఊహకు అందే సీన్లు, రొటీన్ క్లైమాక్స్ నిరాశకు గురిచేస్తాయి. రేటింగ్: 1/5
News November 7, 2025
క్షమాపణలు చెప్పిన రిలయన్స్, స్కోడా.. ఎందుకంటే?

ఏదైనా భారీ తప్పిదం జరిగినప్పుడు కంపెనీలు తమ కస్టమర్లకు క్షమాపణలు చెప్పడం సహజమే. కానీ ఒకేసారి పలు కంపెనీలు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే సరికొత్త సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ సరదాగా ట్వీట్ చేశాయా కంపెనీలు. ‘నాణ్యమైనవి చౌకగా ఇస్తున్నందుకు’ రిలయన్స్, సేఫ్టీలో కాంప్రమైజ్ కానందుకు స్కోడా & ఫోక్స్ వాగన్ కంపెనీలు క్షమాపణలు చెప్పాయి.
News November 7, 2025
రేపు స్కూళ్లకు సెలవు లేదు: డీఈవోలు

AP: ఇటీవల ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు వరుస సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటికి బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఏలూరు, బాపట్ల, విశాఖలో స్కూళ్లు యథావిధిగా తెరుచుకోనున్నాయి. అలాగే DEC 13, FEB 14న కూడా పాఠశాలలు పనిచేయనున్నాయి. మీకూ రేపు స్కూల్ ఉందా? COMMENT


