News June 12, 2024

రన్‌ మెషీన్‌కు ఏమైంది!

image

రన్ మెషీన్‌ విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రేమికులను నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్లో పరుగుల వరద పారించిన అతడు పొట్టి ప్రపంచకప్‌లో ఆకట్టుకోలేకపోతున్నారు. అమెరికా గడ్డపై పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కోహ్లీ గత రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో 1, 4 స్కోర్లతో వెనుదిరిగారు. తాజాగా USAతో మ్యాచ్‌లోనూ డకౌట్‌ అయ్యారు. కోహ్లీ ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 14, 2025

తెలంగాణ రౌండప్

image

* ఈ నెల 17 నుంచి 22 వరకు సర్కారు స్కూళ్లను తనిఖీ చేయనున్న ఉన్నతాధికారులు.. సేఫ్ అండ్ క్లీన్, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించనున్న స్పెషల్ అధికారులు
* చిన్న చిన్న కారణాలతో 2021 నుంచి తొలగించిన 1,300 మంది ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఎండీ నాగిరెడ్డికి కవిత వినతి
* సమ్మె కారణంగా వాయిదా పడిన ఫార్మసీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం..

News November 14, 2025

ఆలు లేత, నారు ముదర అవ్వాలి

image

ఈ సామెతలో ఆలు అంటే తమలపాకు. అది ఎంత లేతగా ఉంటే అంత రుచిగా, మృదువుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా కొన్ని(స్వభావం, మాటతీరు) విషయాల్లో మృదువుగా, సున్నితంగా ఉండాలి. ఇక్కడ నారు అంటే వరి నారు, మొక్కల నారు. అది నాటే సమయానికి ముదురుగా ఉంటేనే మంచి పంట వస్తుంది. అలాగే మనిషి కూడా కొన్ని విషయాల్లో (విలువలు, నిర్ణయాలు, పట్టుదల) దృఢంగా, స్థిరంగా ఉంటే మంచిదని ఈ సామెత అర్థం.

News November 14, 2025

SAvsIND: ఈ‘డెన్’ మనదేనా?

image

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో నేటి నుంచి టీమ్ఇండియా తొలి టెస్టు ఆడనుంది. ఈడెన్‌లో 42 మ్యాచులు ఆడిన భారత్ 13 గెలిచి, 9 ఓడగా మరో 20 మ్యాచులు డ్రాగా ముగిశాయి. చివరగా 2019లో BANతో జరిగిన టెస్టులో భారత్‌ గెలిచింది. అయితే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌ SAను తక్కువ అంచనా వేయొద్దని గిల్ సేన భావిస్తోంది. 9.30AMకు మ్యాచ్ మొదలుకానుంది. స్టార్ స్పోర్ట్స్, జియోహాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.