News June 13, 2024

TODAY HEADLINES

image

* ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
* మంత్రులుగా పవన్, లోకేశ్ ప్రమాణం
* తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
* ‘దోస్త్’ కౌన్సెలింగ్ గడువు పెంపు
* ఒడిశా సీఎంగా చరణ్ మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం
* కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం 50 మందికి పైగా మృతి

Similar News

News December 24, 2024

అసద్‌కు ఇంటిపోరు.. విడాకులకు భార్య దరఖాస్తు?

image

సిరియాలో తిరుగుబాటుతో రష్యాలో తలదాచుకుంటున్న మాజీ అధ్యక్షుడు బషర్ అసద్‌కు ఇప్పుడు ఇంటిపోరు మొదలైంది. అతని భార్య అస్మా విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె రష్యా కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. లండన్ తిరిగెళ్లేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్కోలో ఆశ్రయం పొందడం ఇష్టం లేకపోవడమే డివోర్స్ కారణమట. అయితే ఈ వార్తలను అధికారులు ఖండించారు.

News December 24, 2024

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రులతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తారు. రేపు రాత్రి అమరావతికి తిరిగొస్తారు.

News December 24, 2024

రష్యా ఆయిల్ దిగుమతి తగ్గింది.. మిడిల్ ఈస్ట్ నుంచి పెరిగింది

image

మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి NOVలో భారత్ క్రూడాయిల్ కొనుగోళ్లు 9 నెలల గరిష్ఠానికి చేరాయి. గత నెల ప్రతి రోజూ 2.28M బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి జరిగింది. OCTతో పోలిస్తే ఇది 10.8% ఎక్కువ. ఇది మొత్తం దేశీయ క్రూడాయిల్ దిగుమతుల్లో 48%. ఇదే సమయంలో రష్యా నుంచి దిగుమతి తగ్గడం గమనార్హం. OCTలో రోజూ 1.58 మిలియన్ బ్యారెళ్ల కొనుగోళ్లు జరగగా, NOVలో 13% తగ్గింది. మొత్తం దిగుమతుల్లో ఇది 32%.