News June 13, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 13, గురువారం
జ్యేష్ఠమాసం
శు.సప్తమి: రాత్రి 9.33 గంటలకు
పుబ్బ: తెల్లవారుజామున 5:08 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.9:57 నుంచి 10:49 వరకు
దుర్ముహూర్తం: మ.3:09 నుంచి 4:00 వరకు
వర్జ్యం: ఉ.11.11 నుంచి మ.12.58 వరకు

Similar News

News December 24, 2024

భూ రికార్డుల్లో తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు!

image

TG: ప్రభుత్వం ధరణి స్థానంలో ‘భూ భారతి’ చట్టాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందిన ఈ చట్టం బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వం కఠిన నిబంధనలను పెట్టినట్లు తెలుస్తోంది. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే అధికారులపై క్రిమినల్ కేసులతో పాటు ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

News December 24, 2024

అకౌంట్లలోకి రూ.12,000.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా ₹12K అందించే పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనుంది. ఈమేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే ఇప్పటికీ మార్గదర్శకాలు వెల్లడించకపోవడంపై పేదలు ఆందోళన చెందుతున్నారు. తొలి విడతలో ఈ నెల 28న ఖాతాల్లో ₹6K చొప్పున జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

News December 24, 2024

జాబ్ అప్లికేషన్‌కు 18% GST.. కేంద్రంపై ప్రియాంకా గాంధీ ఫైర్

image

అగ్నివీర్‌తో సహా ప్రతి ఉద్యోగ నియామక పరీక్షల దరఖాస్తులపై కేంద్రం 18% జీఎస్టీ విధిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. యూపీలోని ఓ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు ఫీజు ₹1000 ఉంటే దానిపై జీఎస్టీ ₹180 అని పేర్కొన్నారు. పిల్లల్ని చదివించడం కోసం పేరెంట్స్ రూపాయి రూపాయి కూడబెడితే, ప్రభుత్వం వారి కలల్ని ఇలా ఆదాయ వనరుగా మార్చుకుంటోందని మండిపడ్డారు.