News June 13, 2024
విశాఖ: 26 కేంద్రాల్లో పరీక్ష
జిల్లాలో ఈనెల 16వ తేదీన రెండో సెషన్లలో జరిగే యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా సమన్వయం పరీక్ష విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలోని 26 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News January 28, 2025
విశాఖ: ‘అందుబాటు ధరల్లో స్థలాలు’
ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్”లో స్థలాలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉన్నాయని వి.ఎం.ఆర్.డి.ఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. విశాఖ జిల్లా రామవరం, పాలవలస, గంగసాని అగ్రహారం, అనకాపల్లి జిల్లా అడ్డూరు, విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతాలలో అన్ని మౌలిక వసతులతో లభ్యమవుతున్నాయన్నారు. అనాధికారిక లేఔట్లలో స్థలాలు కొని మోసపోవద్దని సూచించారు.
News January 28, 2025
విశాఖ: 8 పర్యాటక ప్రాజెక్టులకు ఎంవోయూలు
విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూపై పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. సోమవారం విశాఖలో ఓ హోటల్‌లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు 150కి పైగా పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో 825 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు.
News January 27, 2025
పద్మనాభం: ఉరి వేసుకుని మహిళ, యువకుడు మృతి
పద్మనాభ (మం) కృష్ణాపురంలో ఓ మహిళ, యువకుడు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వివాహిత మహిళ లక్ష్మి(31), మోకర ఆదిత్య(21) గ్రామంలో వేర్వేరు చోట్ల ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పద్మనాభం సీఐ శ్రీధర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.