News June 13, 2024
ట్విటర్ బయోలో మార్పు
AP: ట్విటర్‌లో సీఎం చంద్రబాబు నాయుడు బయో మారింది. ఇది వరకు టీడీపీ అధినేత, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అని ఉండగా తాజాగా దీనికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని యాడ్ చేశారు. ఇవాళ నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈమేరకు మార్పులు చేశారు. కాగా టీడీపీ అధినేతకు ట్విటర్‌లో 5.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆయన 11 మందిని ఫాలో అవుతున్నారు.
Similar News
News December 24, 2024
జాబ్ అప్లికేషన్‌కు 18% GST.. కేంద్రంపై ప్రియాంకా గాంధీ ఫైర్
అగ్నివీర్‌తో సహా ప్రతి ఉద్యోగ నియామక పరీక్షల దరఖాస్తులపై కేంద్రం 18% జీఎస్టీ విధిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. యూపీలోని ఓ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు ఫీజు ₹1000 ఉంటే దానిపై జీఎస్టీ ₹180 అని పేర్కొన్నారు. పిల్లల్ని చదివించడం కోసం పేరెంట్స్ రూపాయి రూపాయి కూడబెడితే, ప్రభుత్వం వారి కలల్ని ఇలా ఆదాయ వనరుగా మార్చుకుంటోందని మండిపడ్డారు.
News December 24, 2024
‘మిషన్ భగీరథ’ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
TG: మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రభుత్వం 18005994007 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కాల్ సెంటర్‌ను HYDలోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీసులో నిన్న ప్రారంభించారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ 24/7 పనిచేస్తుంది. రాత్రి పూట వచ్చే కాల్స్ రికార్డు అవుతాయి. ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
News December 24, 2024
ఉ.కొరియాకు భారీ మిలటరీ లాస్: జెలెన్‌స్కీ
రష్యా తరఫున తమతో యుద్ధం చేస్తోన్న ఉత్తరకొరియా సైనికులు 3వేల మంది చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. కుర్స్క్ రీజియన్ నుంచి తమకు ఈ ప్రాథమిక నివేదిక అందిందన్నారు. మరిన్ని అదనపు బలగాలు, ఆయుధ సామగ్రిని నార్త్ కొరియా పంపనుందని, ఆ ముప్పును ఎదుర్కొనేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.