News June 13, 2024
ఇవాళ లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు
TG: న్యాయ కళాశాలల్లో LLB, LLM కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్ 3న నిర్వహించిన ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మ.3.30 గంటలకు రిలీజ్ చేస్తారు.
Similar News
News December 24, 2024
ఉ.కొరియాకు భారీ మిలటరీ లాస్: జెలెన్‌స్కీ
రష్యా తరఫున తమతో యుద్ధం చేస్తోన్న ఉత్తరకొరియా సైనికులు 3వేల మంది చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. కుర్స్క్ రీజియన్ నుంచి తమకు ఈ ప్రాథమిక నివేదిక అందిందన్నారు. మరిన్ని అదనపు బలగాలు, ఆయుధ సామగ్రిని నార్త్ కొరియా పంపనుందని, ఆ ముప్పును ఎదుర్కొనేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
News December 24, 2024
బన్నీ వివాదంపై ఎవరూ మాట్లాడొద్దని సీఎం ఆదేశాలు?
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట- అల్లు అర్జున్ విషయంపై INC నేతలెవరూ మాట్లాడొద్దని CM రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు TPCC చీఫ్ మహేశ్‌కుమార్‌కు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. చట్టం తనపని తాను చేస్తున్నందున ఇక ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో విపక్షాల ప్రశ్నలకు సమాధానంగా తాను బన్నీపై మాట్లాడానని CM పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
News December 24, 2024
పుష్ప-2 రికార్డులను YRF బద్దలుకొట్టాలి: అల్లు అర్జున్
కలెక్షన్లలో అదరగొడుతున్న పుష్ప-2 టీమ్‌కు యశ్ రాజ్ ఫిల్మ్స్(YRF) కంగ్రాట్స్ చెప్పింది. ‘రికార్డులున్నది బద్దలవడానికే. మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడతాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్న పుష్ప-2 చిత్రబృందానికి శుభాకాంక్షలు. ఇది ఫైరు కాదు వైల్డ్ ఫైరు’ అని పేర్కొంది. దీంతో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రికార్డును YRF బద్దలుకొడుతుందని ఆశిస్తున్నానన్నారు.