News June 13, 2024

శ్రీకాకుళం: 1996 నుంచి కొనసాగుతున్న అచ్చెన్నాయుడు

image

టెక్కలిలో హ్యాట్రిక్ విజయం సాధించిన అచ్చెన్నాయుడు మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996 ఉపఎన్నికల్లో ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. 2009లో ఓటమి చవిచూసిన అచ్చెన్న 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. అనంతరం కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2020 నుంచి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Similar News

News October 30, 2025

కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

image

కొత్తూరు మండలం కడుమ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం మాలతీబాయి (48) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రం కాశీనగరంలో నివాసం ఉంటూ ప్రతిరోజూ విధులకు కడుమ సచివాలయానికి ద్విచక్ర వాహనంపై వస్తుంటారు. ఇవాళ విధులకు వస్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురై మాలతీ బాయి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 30, 2025

శ్రీకాకుళం: 2,230 హెక్టార్లలో వరి పంటకు నష్టం

image

తుఫాన్ వర్షాలు కారణంగా జిల్లాలో 2,230 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా చేతికి అంది వచ్చిన పంట నేలవాలిందని, కొన్నిచోట్ల నీట మునిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట పొలాలను పరిశీలించి తుది అంచనా సిద్ధం చేస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫారుక్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

News October 30, 2025

ఇచ్ఛాపురంలో పర్యటించిన జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్

image

‘మెంథా’ తుపాను ప్రభావంతో జిల్లాలో నష్టం వాటిల్లిన నేపథ్యంలో, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఇచ్ఛాపురం మండలంలో పర్యటించారు. తుపాన్ కారణంగా జిల్లాలో అత్యధికంగా ఈ మండలంలో 1,118 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. బిల్లంగి, జగన్నాథపురం గ్రామాల్లో నీటి ముంపులో ఉన్న వరి చేలును ఆయన పరిశీలించారు. 53 క్యూసెక్కులు నీరు బహుదానదిలో ప్రవహిస్తుందన్నారు. నష్టం అంచనా వేయాలన్నారు.