News June 13, 2024

విషం తాగి అమ్మకు ఫోన్.. ఆసుపత్రిలో మృతి

image

విషం తాగి యువతి మృతి చెందిన ఘటన రాజమండ్రిలోని ప్రకాశంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. పోలవరం మండలం తోటగుందికి చెందిన యువతి(21) బీఎస్సీ చదివింది. స్నేహితురాలి పెళ్లికని తల్లికి చెప్పి ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లింది. 10న తల్లికి ఫోన్ చేసి ‘నేను రాజమండ్రి బస్టాండ్‌లో ఉన్నా. విషం తాగా..’ అని చెప్పింది. వెళ్లి ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

Similar News

News March 2, 2026

పోలీస్ పీజీఆర్ఎస్‌లో 31 అర్జీలు: ఎస్పీ నర్సింహ కిషోర్

image

రాజమండ్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజిఆర్ఎస్ జరిగింది. ఎస్పీ డి.నరసింహ కిషోర్ అధికారులతో కలిసి బాధితుల నుంచి 31 అర్జీలను స్వీకరించారు. కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం బాధితులకు ఎంతో తోడ్పాటును అందిస్తోందన్నారు. వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

News March 1, 2026

రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

image

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News March 1, 2026

తూ.గో: ఇక ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

image

రవాణాశాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తూ.గో రవాణాధికారి ఆర్. సురేశ్ శనివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ‘Sarathi Parivahan’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్ చెల్లింపుల వంటి సేవలను ‘Vahan Parivahan’ పోర్టల్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇంటి నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.