News June 13, 2024

వానొస్తే.. వాగుగా మారి దర్శనమిస్తున్న హైవే రోడ్డు

image

అధికారుల నిర్లక్ష్యం, దూరదృష్టి లోపంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. యాడికి మండలం పెద్దపేట గుండా వెళ్లే రాష్ట్రీయ రహదారి వానొస్తే చాలు వాగులా మారుతోంది. పెద్దపేట ఎస్సీ కాలనీ వద్ద రహదారి మడుగులా మారుతోందని, వాహనాల రాకపోకలకు, చోదకులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. రెండేళ్లుగా ఈ దుస్థితి ఇలాగే కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News January 24, 2026

ఎస్కేయూ బీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల బీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంచార్జ్ ఉపకులపతి అనిత తన చాంబర్‌లో వీటిని ప్రకటించారు. మొత్తం 722 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 670 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 92.80గా నమోదైందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, ప్రొఫెసర్ జివి రమణ, శ్రీరామ్ నాయక్ పాల్గొన్నారు.

News January 23, 2026

కనేకల్: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మందికి అస్వస్థత

image

కనేకల్ మండలం 43 ఉడేగోళం పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు వారిని కనేకల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

News January 23, 2026

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్పీ

image

వాహనదారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. అనంతపురంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దీనివల్ల సాటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.