News June 13, 2024
ఓదెల మల్లన్న ఆలయంలో ఒగ్గు పూజారుల చేతివాటం!

ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఒగ్గు పూజారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పట్నం వేసే సమయంలో ఒగ్గు పూజారులు రూ.300 ఇస్తేనే పూజ చేసి కంకణం కడతామని డిమాండ్ చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆలయ ఈఓ స్పందిస్తూ.. పూజారులు డబ్బులు డిమాండ్ చేసినట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఒగ్గు పూజారుల యూనియన్‌తో మాట్లాడి ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News January 17, 2026
కరీంనగర్: చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి: కలెక్టర్

స్థానిక బాల సదనంకు చెందిన తొమ్మిది, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను హైదరాబాద్‌కు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతానం లేని వారు చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News January 17, 2026
KNR: ఈనెల 20న అప్రెంటిస్‌షిప్ ఇంటర్వ్యూలు

జహీరాబాద్, సంగారెడ్డిలోని మహీంద్రా సంస్థలో 300 అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులై, 18-25 ఏళ్ల వయసున్న కరీంనగర్ జిల్లా గ్రామీణ యువత దీనికి అర్హులు. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో కరీంనగర్‌లోని స్వశక్తి కళాశాలలోని ఈజీఎంఎం కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.
News January 16, 2026
KNR: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ కార్యాలయంలో గురువారం సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించగా, సిబ్బంది పండుగ వాతావరణంలో పాల్గొన్నారు.


