News June 13, 2024
వైజాగ్‌లో RBI ప్రాంతీయ కార్యాలయం

AP: విశాఖపట్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని VMRDA భవనంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్బీఐ అధికారులు భావిస్తున్నారు. ఆ భవనంలోని ఐదో అంతస్తును కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జునను ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ కోరారు. కాగా ప్రతి రాష్ట్రంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఉంటుంది. దీంతో రాష్ట్రంలోనూ ఈ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News September 14, 2025
ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి

ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచులో భారత్ ఓడిపోయింది. తొలుత భారత మహిళల జట్టు 281/7 రన్స్ చేసింది. ప్రతిక (64), స్మృతి (58), హర్లీన్ (54) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 44.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లిచ్‌ఫీల్డ్ 88 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. మూనీ 77 రన్స్‌తో రాణించారు.
News September 14, 2025
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్: CM

AP: తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని, ప్రతి బస్సుకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త బస్ స్టేషన్లో 150 బస్సులు ఒకేసారి నిలిపేలా బస్‌బే ఉండాలని, లక్ష మంది రాకపోకలు సాగించేందుకు వీలుగా దీనిని నిర్మించాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునికీకరించాలని సూచించారు.
News September 14, 2025
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక హైకమాండ్‌దే: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయం హైకమాండ్ చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్, మంత్రులతో సమావేశమైన రేవంత్.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆదేశించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. బూత్‌ల వారీగా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.