News June 13, 2024
అవిశ్వాసం వీగిపోతుంది: డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నష్టాల్లో ఉన్న బ్యాంకును తమ పాలకవర్గం, రైతుల సహకారంతో అభివృద్ధి పథంలో నడిపించామని డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. డీసీసీబీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని , డైరెక్టర్లు అందరూ తమ వైపే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. రూ.900 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంకుని రూ.2400 కోట్ల టర్నోవర్ కు తెచ్చామని తెలిపారు.
Similar News
News January 15, 2026
NLG: వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరేనో!

మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో వర్గపోరు పార్టీల్లో గందరగోళం సృష్టిస్తోంది. BJP పుంజుకుంటున్న తరుణంలో వర్గపోరు నేతలకు తలనొప్పిగా మారగా, కాంగ్రెస్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, DCC అధ్యక్షుడు పున్నా కైలాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది. మరోవైపు కార్పొరేషన్ తమదే అంటూ BRS వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో విజయం ఎవరిదో కామెంట్ చేయండి.
News January 15, 2026
నల్గొండలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

1. నల్గొండ కార్పొరేషన్ 48: ST 1,SC 7, BC 16, UR 24
2. చండూర్ 10: ST 1, SC 1, BC 3, UR 5.
3.చిట్యాల 12: ST 1, SC 2, BC 3, UR 6.
4.దేవరకొండ 20: ST 3, SC 2, BC 5, UR 10.
5.హాలియా12: ST 1, SC 2, BC 3, UR 6.
6.మిర్యాలగూడ 48: ST 3, SC 5, BC 16, UR 24.
7.నకిరేకల్ 20: ST 1, SC 3, BC 6, UR 10.
8.నందికొండ 12: ST 1, SC 2, BC 3, UR 6.
News January 15, 2026
NLG: జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్రం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓ పక్క సర్వర్ మొరాయింపు.. ఇంకోపక్క వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం.. మరోవైపు అవగాహన లేమి.. వెరసి పంటల ఆన్లైన్ నమోదుకు అడ్డంకిగా మారాయి. జిల్లాలో 5,65,782 మంది రైతులకు గాను ఇప్పటివరకు 30,953 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 3,34,953 మంది రైతులు రిజిస్ట్రేషన్కు దూరంగా ఉన్నారు.


