News June 13, 2024

WGL: బస్సు ముందు కూర్చొని మహిళ నిరసన

image

ఆర్టీసీ బస్సు ఆగకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు బస్సుకు అడ్డం తిరిగి రోడ్డుపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-MHBDకు వెళ్లే ఆర్టీసీ బస్సులో తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగారు. ఇంతలో డ్రైవర్ బస్సును పోనిచ్చాడు. సదరు మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

Similar News

News January 5, 2026

10 నిమిషాల్లోనే సమస్యకు వరంగల్ కలెక్టర్ చెక్

image

ప్రజావాణిలో 10 సంవత్సరాలు పూర్తికాని సమస్యను పది నిమిషాల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిష్కరించారు. దరఖాస్తుదారుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి తన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మ్యుటేషన్ పెండింగ్ సమస్యపై తీవ్ర ఆవేశంతో వచ్చారు. సమస్య పరిష్కారం కావడంతో ప్రశాంతంగా వెళ్లారు. సమస్య ఏదైనా ప్రశాంతంగా పరిష్కారం అవుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

News January 4, 2026

హాల్టికెట్లలో మార్పులుంటే చేసుకోవచ్చు: డీఐఈవో

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లలో ఏవైనా మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వరంగల్ డీఐఈవో డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్నెట్ లో హాల్టిక్కెట్ల ప్రివ్యూను బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నమూనా హాల్ టికెట్లలో పరిశీలించి ఏవేని మార్పులున్నట్లయితే ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు.

News January 4, 2026

WGL: మున్సిపల్ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ..!

image

మున్సిపల్ ఎన్నికల పోరు సిద్ధమవుతోందన్న సంకేతాలు జిల్లాలో తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎలా ఉంటాయో..? అనే చర్చ జరుగుతోంది.