News June 13, 2024
మరి మా ప్రత్యేక హోదా సంగతి?: రఘువీరా రెడ్డి

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు కేంద్రంలోని ఇతర పెద్దలు హాజరయ్యారు. ఈక్రమంలో ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటు స్పెషల్ ప్యాకేజీపై వారిని ప్రశ్నించాలంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు సూచించారు. తాజాగా ‘ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రత్యేక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం’ అని మోదీ చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి రిప్లై ఇచ్చారు. ‘మరి మా ప్రత్యేక హోదా సంగతి?’ ఏంటి అని ప్రశ్నించారు.
Similar News
News October 30, 2025
500 గిగావాట్ల విద్యుదుత్పత్తి.. భారత్ రికార్డ్

దేశంలోని అన్ని వనరుల నుంచి కలిపి విద్యుదుత్పత్తి తొలిసారి 500 గిగావాట్లను దాటింది. ఇది సరికొత్త రికార్డని కేంద్రం తెలిపింది. 2014 మార్చి 31 నాటికి 249 గిగావాట్ల ఉత్పత్తి ఉండగా ఈ ఏడాది SEP 30 నాటికి రెట్టింపు ఉత్పత్తి జరిగినట్లు పేర్కొంది. ఇందులో జల, అణు, సౌర, పవన విద్యుత్ వాటా 256 గిగావాట్లు, శిలాజ వనరుల వాటా 244.80 గిగావాట్లుగా ఉందని వెల్లడించింది.
News October 30, 2025
మళ్లీ భీకర దాడులు.. గాజాలో 104 మంది మృతి

ఇజ్రాయెల్-గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరోసారి బ్రేకయ్యింది. గాజాపై తాజాగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 104 మంది పౌరులు మరణించగా, 250 మందికి గాయాలయ్యాయి. తమ సైనికుడిని హమాస్ చంపేయడంతో టెర్రర్ గ్రూపులపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది. స్కూళ్లు, నివాసాలపై IDF బాంబులు వేసినట్లు ఆరోపించింది.
News October 30, 2025
ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో రికార్డు

మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మారిజానె కాప్(44W) నిలిచారు. నిన్న ENGతో సెమీస్‌లో 5 వికెట్లు తీసిన ఆమె, భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి(43)ని అధిగమించారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో లిన్ ఫుల్‌స్టన్(39), మేఘన్ షుట్(39), కరోల్ హోడ్జెస్(37), సోఫీ ఎక్లెస్టోన్(37) ఉన్నారు. కాగా నిన్న SFలో మారిజానె కాప్ బ్యాటింగ్‌లోనూ విలువైన 42 రన్స్ చేశారు.


