News June 13, 2024

రేవంతన్న, చంద్రన్న ఇలానే కలిసి ఉండాలి: బండ్ల

image

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ ఆకాంక్షించారు. ‘పదవులు, హోదాలు, డబ్బులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ బంధం అనేది విడదీయరానిది. నా చంద్రన్న, నా రేవంత్ అన్న రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇలానే ఉండాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News January 1, 2025

సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ ఎప్పుడంటే

image

సంక్రాంతికి తెలంగాణ-ఏపీ మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. ఈ నెల 9, 11న కాచిగూడ-కాకినాడ, 10న హైదరాబాద్(నాంపల్లి)-కాకినాడ మధ్య నడవనున్నట్లు పేర్కొంది. 10, 12 తేదీల్లో కాకినాడ-కాచిగూడ, 11న కాకినాడ-హైదరాబాద్ మధ్య నడవనున్నట్లు తెలిపింది. రేపు ఉదయం 8గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయంది. ఈ రైళ్లు మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

News January 1, 2025

ఈరోజు నుంచి ఇలా చేస్తే బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్ దరిచేరవు!

image

న్యూఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని వాగ్దానాలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రోజుకు 10వేల అడుగులు నడుస్తామని ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నారు. ఒక దగ్గర కూర్చోకుండా శరీరాన్ని కదిలించాలి. రోజూ నడవడం వల్ల అధిక బరువు, మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, క్యాన్సర్‌తో పాటు అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలిపారు.

News January 1, 2025

TGB ఖాతాదారులకు నూతన మార్గదర్శకాలు

image

TG: రాష్ట్రంలోని 493 ఏపీజీవీబీ బ్రాంచ్‌లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమయ్యాయి. దీంతో 927 శాఖలతో TGB దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో పాత ఖాతా కలిగిన వారికి TGB మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త ఏటీఎం కార్డు కోసం సంబంధిత బ్రాంచ్‌లో సంప్రదించాలి. పాత చెక్‌బుక్‌ను వెనక్కి ఇవ్వాలి. TGB వాట్సాప్ సేవల కోసం 9278031313ను, ఇంటర్నెట్ సేవలకు www.tgbhyd.inను వాడాలి.