News June 13, 2024

అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ ప్రమాణం

image

అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా వరుసగా మూడోసారి పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. చౌనా మీన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈటానగర్‌లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో గవర్నర్ కేటీ పర్నాయక్ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. కాగా రాష్ట్రంలోని మొత్తం 60 సీట్లలో 46 స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News January 1, 2025

ఈరోజు నుంచి ఇలా చేస్తే బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్ దరిచేరవు!

image

న్యూఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని వాగ్దానాలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రోజుకు 10వేల అడుగులు నడుస్తామని ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నారు. ఒక దగ్గర కూర్చోకుండా శరీరాన్ని కదిలించాలి. రోజూ నడవడం వల్ల అధిక బరువు, మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, క్యాన్సర్‌తో పాటు అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలిపారు.

News January 1, 2025

TGB ఖాతాదారులకు నూతన మార్గదర్శకాలు

image

TG: రాష్ట్రంలోని 493 ఏపీజీవీబీ బ్రాంచ్‌లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమయ్యాయి. దీంతో 927 శాఖలతో TGB దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో పాత ఖాతా కలిగిన వారికి TGB మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త ఏటీఎం కార్డు కోసం సంబంధిత బ్రాంచ్‌లో సంప్రదించాలి. పాత చెక్‌బుక్‌ను వెనక్కి ఇవ్వాలి. TGB వాట్సాప్ సేవల కోసం 9278031313ను, ఇంటర్నెట్ సేవలకు www.tgbhyd.inను వాడాలి.

News January 1, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్?

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే సిమెంట్, ఇనుమును సంబంధిత కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే అందేలా చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ స్కీమ్ కింద సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు, స్థలం లేని వారికి స్థలం+రూ.5లక్షలు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.