News June 13, 2024
సిమెంట్ రంగంపై అదానీ ఫోకస్!

వివిధ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న అదానీ గ్రూప్ దృష్టి ఇప్పుడు సిమెంట్ రంగంపై పడింది. $3 బిలియన్లతో (రూ.25వేల కోట్లపైనే) పలు కంపెనీలను కొనాలని ప్లాన్ చేస్తోందట. ఈ జాబితాలో HYDకు చెందిన పెన్నా సిమెంట్ సహా సౌరాష్ట్ర సిమెంట్, వాద్‌రాజ్ సిమెంట్ తదితర సంస్థలు ఉన్నాయి. 3-4ఏళ్లలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్‌ను దాటి అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా నిలవాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.
Similar News
News September 15, 2025
BREAKING: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ASIA CUP-2025: పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్‌తో ఆడనుంది.
News September 15, 2025
బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9లో తొలి వారం శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఆమెను ఎలిమినేట్ చేసినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న నటి ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి, రీతూ చౌదరి సేఫ్ జోన్‌లోకి చేరుకున్నారు. వీళ్లు హౌస్‌లోనే కొనసాగనున్నారు. కొరియోగ్రాఫర్ అయినా శ్రష్ఠి ఈ సీజన్‌లో సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి వెళ్లారు.
News September 15, 2025
నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు: గడ్కరీ

ఇథనాల్ పెట్రోల్ విషయంలో తాను అవినీతికి పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ‘నాకు షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీ, పవర్ ప్లాంట్ ఉన్నాయి. నా ఆదాయం పుష్కలంగా ఉంది. నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు. నాకు దిగజారే అవసరం లేదు’ అని నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వెల్లడించారు.