News June 13, 2024

కృష్ణా: ఒక్క సంతకంతో 4.78లక్షల మందికి లబ్ధి

image

సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ అనంతరం నేడు పింఛను రూ.4 వేలకు పెంచుతూ.. మూడో సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సంతకంతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఉన్న 4,78,736 మందికి జూలై నుంచి పెరిగిన పింఛన్ సొమ్ము అందనుంది. కాగా అధికారిక డాష్‌బోర్డు సమాచారం ప్రకారం జూన్ నాటికి మొత్తంగా కృష్ణా జిల్లాలో 2,42,856, ఎన్టీఆర్ జిల్లాలో 2,35,880 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.

Similar News

News October 2, 2024

కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీపీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News October 2, 2024

బీటెక్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో 2024- జనవరిలో జరిగిన బీటెక్ 1, 3వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రీవాల్యుయెషన్‌కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

News October 2, 2024

సీఎం చంద్రబాబు మచిలీపట్నం షెడ్యూల్ ఇదే!

image

సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం మచిలీపట్నంలో పర్యటన వివరాలను సీఎం కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉండవల్లిలోని సీఎం స్వగృహం నుంచి ఉదయం 10 గంటలకు హెలిప్యాడ్ ద్వారా బయలుదేరి 10:20కు మచిలీపట్నం చేరుకుంటారన్నారు. అక్కడ 10:30 వరకు ప్రభుత్వ అధికారులతో సమావేశం అవుతారన్నారు. అనంతరం మచిలీపట్నంలోని పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.10కి తిరిగి ప్రయాణమవుతారని తెలిపారు.