News June 13, 2024
రికార్డు సృష్టించిన వెస్టిండీస్

ఇంటర్నేషనల్ టీ20ల్లో వెస్టిండీస్ కొత్త రికార్డు సృష్టించింది. 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో ఆ జట్టు 30 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచులో విండీస్ 13 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News February 17, 2026
నటి ప్రత్యూష కేసు.. నిందితుడు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం

నటి ప్రత్యూష మృతి <<19162866>>కేసులో<<>> సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 4 వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిందితుడు సిద్దార్థ రెడ్డిని ఆదేశించింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించింది. పోస్టుమార్టం అన్‌ప్రొఫెషనల్‌గా నిర్వహించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
News February 17, 2026
బీర పంటకు నీటిని ఇలా అందిస్తే మేలు

బీర విత్తనాలను నాటడానికి ముందు పొలంలో నీరు పెట్టాలి. తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు అందించాలి. మొక్కకు దగ్గరగా కాకుండా కాస్త దూరంలో ఎరువు వేయాలి. తర్వాత ఎరువుపై మట్టిని కప్పి నీటిని పెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
News February 17, 2026
ధురంధర్ మేకర్స్‌కు షాక్.. బ్లాక్‌లిస్ట్‌లో ప్రొడక్షన్ హౌస్?

ధురంధర్ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్న వేళ ఆ ఫిల్మ్ మేకర్స్‌కు షాక్ తగిలింది. ఈ సినిమా నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్‌ను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేసేందుకు ముంబై కార్పొరేషన్(BMC) సిద్ధమైంది. అనుమతులు లేకుండా భవనాలపై షూటింగ్‌లు చేసి వరుస ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌లిస్ట్ అయితే భవిష్యత్తులో ముంబైలో షూటింగ్ చేపట్టేందుకు నిర్మాణ సంస్థకు అనుమతులు లభించవు.


