News June 13, 2024
మగవారికి సపోర్ట్‌గా రష్మిక మందన్న ట్వీట్

మగవారిని కించపరుస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు హీరోయిన్ రష్మిక మందన్న కౌంటర్ ఇచ్చారు. ‘మగాడిని నమ్మడం కంటే భయంకరమైనది మరొకటి లేదని గుర్తుంచుకోండి’ అని యానిమల్ సినిమాలోని సీన్‌ను ఓ నెటిజన్ షేర్ చేశారు. దీనికి రష్మిక స్పందిస్తూ.. ‘మూర్ఖుడిని నమ్మడం భయానకం. మగాళ్లలో చాలామంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వారిని నమ్మడం ఎంతో ప్రత్యేకం’ అని తెలిపారు.
Similar News
News September 15, 2025
BREAKING: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ASIA CUP-2025: పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్‌తో ఆడనుంది.
News September 15, 2025
బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9లో తొలి వారం శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఆమెను ఎలిమినేట్ చేసినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న నటి ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి, రీతూ చౌదరి సేఫ్ జోన్‌లోకి చేరుకున్నారు. వీళ్లు హౌస్‌లోనే కొనసాగనున్నారు. కొరియోగ్రాఫర్ అయినా శ్రష్ఠి ఈ సీజన్‌లో సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి వెళ్లారు.
News September 15, 2025
నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు: గడ్కరీ

ఇథనాల్ పెట్రోల్ విషయంలో తాను అవినీతికి పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ‘నాకు షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీ, పవర్ ప్లాంట్ ఉన్నాయి. నా ఆదాయం పుష్కలంగా ఉంది. నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు. నాకు దిగజారే అవసరం లేదు’ అని నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వెల్లడించారు.