News June 13, 2024
‘RRR’ రికార్డును బద్దలు కొట్టిన ‘కల్కి’

అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ప్రభాస్ ‘కల్కి’ మూవీ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బద్దలు కొట్టింది. అమెరికాలో RRR కంటే వేగంగా వన్ మిలియన్ ప్రీ సేల్స్ జరుపుకున్న భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. రిలీజ్‌కు రెండు వారాల ముందే ఈ స్థాయిలో బుకింగ్ జరగడం రికార్డు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 27న రిలీజ్ కానున్న ఈ మూవీ కొత్త రికార్డులు సెట్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి.
Similar News
News January 11, 2026
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
News January 11, 2026
గోదావరి వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి: మంత్రి నిమ్మల

AP: ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3000 TMCల గోదావరి నీటిలో 200 TMCలను వాడుకుంటే తప్పేంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తోటి తెలుగు రాష్ట్రానికి స్నేహ హస్తం అందిస్తుంటే, వారు APకి అన్యాయం జరిగేలా కోర్టుకి వెళ్లడం విచారకరమన్నారు. నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు SCలో విచారణ నేపథ్యంలో అధికారులు, లాయర్లతో VC నిర్వహించారు. రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు.
News January 11, 2026
టెట్ నుంచి ఆ టీచర్లకు ఊరట?

సుప్రీంకోర్టు <<17587484>>తీర్పు<<>> నేపథ్యంలో టీచర్లు కూడా టెట్ రాస్తున్న విషయం తెలిసిందే. అయితే పరీక్ష సిలబస్‌లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు ఉండటంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో 2011 ముందు నియమితులైన టీచర్లకు మినహాయింపునివ్వడంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అడిగినట్లు సమాచారం. కేంద్రం నిర్ణయంతో 12 లక్షల మందికి పైగా టీచర్లకు ఊరట దక్కే అవకాశం ఉంది.


