News June 13, 2024
జగన్‌ను కలిసిన అనిల్ కుమార్ యాదవ్

తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్‌ను నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. నరసరావుపేట ఎంపీగా ఓడిపోవడానికి గల కారణాలను జగన్‌కు వివరించారు. గెలవకపోయినప్పటికీ వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండాలని అనిల్‌కు జగన్ పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం అనిల్ కుమార్ జగన్‌తో భేటీ కావడం ఇదే మొదటిసారి.
Similar News
News February 28, 2026
అన్నదాతకు రూ.25 వేల మద్దతు ధర వచ్చేనా.?

వరికి ఒక క్వింటా ₹2389 లెక్కన పుట్టి ధర ₹21330 వరకు A- గ్రేడ్ రకానికి ఇస్తుండగా సాధారణ రకానికి పుట్టి ధర ₹20,136 చొప్పున నిర్ణయించారు. అయితే కేంద్రాల్లో ధాన్యం విక్రాయించాలంటే తరుగులతో కొంత తీసేస్తుండగా గొనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి ఉంది. దీంతో ఎకరాకు రూ.35-40 వేల వరకు ఖర్చు అవుతుండగా రైతుకు రూ.20 వేలు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం పుట్టికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరారు.
News February 28, 2026
నెల్లూరు: 3.45 లక్షల ఎకరాల్లో వరిసాగు.!

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరలు దక్కడం లేదు. జిల్లాలో ఈ ఏడాది రబీలో 3.45 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి రానుంది. వచ్చే నెల నుంచి జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. 5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News February 27, 2026
UPSC అభ్యర్థులకు ట్యాబ్‌ల అందజేత

యూపీఎస్సీ(UPSC) పరీక్షల్లో ఉచిత శిక్షణకు ఎంపికైన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ హిమాన్సు శుక్లా అధ్యాయన సామాగ్రితో కూడిన డిజిటల్ ట్యాబ్‌లను అందజేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీటిని అభ్యర్థులకు అందజేశారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.


