News June 13, 2024

అమరావతి రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలి: కొలికపూడి

image

AP: అమరావతి రైతులకు వైసీపీ అధినేత జగన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ నెల 17 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో పాల్గొనే ముందే ఆయన క్షమాపణ కోరాలని అన్నారు. బయటివాళ్లు వదిలినా అసెంబ్లీలో తాను వదలనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈయన అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

Similar News

News December 25, 2024

ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య

image

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా హనుమకొండలోని ఏకశిలా కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని గుగులోతు శ్రీదేవి (16) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి అనారోగ్యం కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యాసంస్థల్లో ఓ వైపు ఫుడ్ పాయిజన్, మరోవైపు ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి.

News December 25, 2024

మళ్లీ జోరు పెంచిన BITCOIN

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో పరుగులు పెట్టాయి. టాప్ 10 కాయిన్లు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. బిట్‌కాయిన్ ఏకంగా 3.99% పెరిగింది. $3789 లాభంతో $98,663 వద్ద ముగిసింది. నేడు $489 నష్టంతో $98,412 వద్ద కొనసాగుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 2.30% లాభంతో $3,485 వద్ద ట్రేడవుతోంది. XRP 1.46, BNB 1.75, SOL 4.30, DOGE 3.39, ADA 1.30, TRON 1.75, AVAX 5.90, LINK 2.68, SHIP 3.59% మేర ఎగిశాయి.

News December 25, 2024

టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

image

ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్(ITBP)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. 7 హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్), 44 కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టులు భర్తీ చేయనున్నారు. 18-25 వయస్సు, ఆసక్తి కలిగిన పురుషులు వచ్చే ఏడాది జనవరి 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ పాసై ఉండాలని బోర్డు తెలిపింది. అదనపు వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.