News June 13, 2024
మంచి భాగస్వామి కోసం వెతుకుతున్నా: మమతా మోహన్‌దాస్

జీవితంలో కచ్చితంగా ఒక తోడు ఉండాలని భావించడం లేదని నటి మమతా మోహన్ దాస్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘లాస్ ఏంజెలెస్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించా. కానీ మా బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. రిలేషన్ ఉండాలి కానీ అందులో ప్రెజర్ ఉండకూడదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం మంచి భాగస్వామి కోసం వెతుకుతున్నా. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకొస్తాయి’ అని చెప్పారు.
Similar News
News September 13, 2025
సెప్టెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

1913: సినీ నటుడు సీహెచ్ నారాయణరావు జననం
1929: స్వతంత్ర సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ మరణం
1948: హైదరాబాద్‌లోకి భారత సైన్యం ప్రవేశం
1960: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జననం
1960: సినీ నటుడు కార్తీక్ జననం
1965: నటి ముచ్చర్ల అరుణ జననం
1969: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ జననం
1989: సినీ రచయిత ఆచార్య ఆత్రేయ మరణం (ఫొటోలో)
News September 13, 2025
దక్షిణ భారత కుంభమేళాకు ఏర్పాట్లు చేయాలి: CM

TG: 2027 జులై 23 నుంచి మొదలయ్యే గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో సమీక్షించారు. గోదావరి వెంట ఉన్న ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేయాలన్నారు. దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వత మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. 74 చోట్ల ఘాట్లను నిర్మించాలని ఆదేశించారు.
News September 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 13, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
✒ ఇష: రాత్రి 7.32 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.