News June 13, 2024

ఉన్నతాధికారులకు అపాయింట్‌మెంట్ ఇవ్వని సీఎం

image

AP: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును కలిసేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రయత్నించారు. వీరిలో జగన్ హయాంలో పనిచేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. అయితే వీరికి చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.

Similar News

News March 1, 2025

కౌలు రైతులకూ రూ.20 వేల సాయం

image

AP: ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ఈ ఏడాది నుంచి ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద రూ.20 వేలను భూమిలేని కౌలు రైతులకూ ప్రభుత్వం అందించనుంది. సాధారణంగా సాగు భూమి ఉన్న రైతులకు ‘పీఎం కిసాన్ యోజన’ కింద కేంద్రం ఏడాదికి రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు ఇస్తుంది. దీన్ని కౌలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, విధివిధానాలు త్వరలో రూపొందించనున్నారు.

News March 1, 2025

రేపటి నుంచి దబిడి దిబిడే..

image

TG: ఆదివారం నుంచి రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిత్యం 36-38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంటూ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. MAR, APR, MAY నెలల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.

News March 1, 2025

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉ.9 – మ.12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 10.58 లక్షల మంది పరీక్షలు రాయనుండగా నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్’ జోన్‌గా ప్రకటించారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయాలని విద్యార్థులకు Way2News సూచిస్తోంది. ALL THE BEST.

error: Content is protected !!