News June 13, 2024
ప్రొద్దుటూరు: YSR ఇంజినీరింగ్ కాలేజీకి అదనంగా 130 సీట్లు మంజూరు

ప్రొద్దుటూరు YSR ఇంజనీరింగ్ కాలేజీ (వైవీయు)కి అదనంగా 130 సీట్లు AICTE మంజూరు చేసినట్లు కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య C.నాగరాజు గురువారం తెలిపారు. కాలేజీలోని 5 బ్రాంచ్‌లకు అదనంగా ప్రతి విభాగానికి 20 సీట్ల చొప్పున, మెటలర్జీ విభాగానికి 30 సీట్ల మొత్తం 130 అదనపు సీట్లకు AICTE అనుమతి ఇచ్చిందన్నారు. మే 20న AICTE కమిటీవారు వర్చువల్ పద్ధతిలో కాలేజీలోని అన్ని మౌలిక వసతులను తనిఖీ చేశారన్నారు.
Similar News
News September 12, 2025
కడప: RI వీరేశంను సన్మానించిన ఎస్పీ

కడప జిల్లా పోలీసు శాఖకు RI వీరేశ్ ఎంతగానో సేవలు అందించాలని జిల్లా SP అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం బదిలీపై చిత్తూరుకు వెళ్తున్న ఆర్ఐ వీరేశ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారన్నారు. వీఐపీల రాక సందర్భంలో ఆర్‌ఐ వీరేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.
News September 12, 2025
భూ సమస్యలపై త్వరిత పరిష్కారం: ఆదితిసింగ్

కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జేసీ ఆదితిసింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సంబంధిత ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా స్పందించి, వచ్చే నెలలోపు పెండింగ్ ఫిర్యాదులను “సున్నా” స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. సెక్షన్ 22-ఏ డెలిషన్, అసైన్డ్ భూముల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరని పేర్కొన్నారు.
News September 12, 2025
కలసపాడు: 3 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

కలసపాడు గ్రామంలోని టైలర్స్ కాలనీలో ఇమ్రాన్ (3)పై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు బాలుడిపై దాడి చేసి లాక్కొని వెళ్తుండగా తల్లిదండ్రులు చూసి కాపాడుకున్నారు. తీవ్ర గాయాలైన చిన్నారిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు లేకుండా తరలించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.