News June 13, 2024

చైనా వల్లనే అపరిష్క‌ృతంగా బోర్డర్ సమస్య: అమెరికా

image

భారత్‌-చైనా సరిహద్దు సమస్య జిన్‌పింగ్ సర్కారు ధోరణి కారణంగానే అపరిష్కృతంగా ఉండిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కర్ట్ క్యాంప్‌బెల్ అన్నారు. ఇరు దేశాలూ ఎప్పటికైనా వాటి ఉమ్మడి ప్రయోజనాలను గుర్తిస్తాయని, ఆ రోజున కలిసి పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో తాము కచ్చితంగా మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. ప్రాదేశిక అంశాల్లో చైనా పట్టువిడుపుతో ఉండాలని ఈ సందర్భంగా కర్ట్ సూచించారు.

Similar News

News October 7, 2024

నిమ్మ రోజూ తినడం వల్ల ఉపయోగాలివే

image

నిమ్మకాయను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఉపయోగాలుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ‘వాటిలో పుష్కలంగా ఉండే విటమిన్-సి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో ఎక్కువ కాలరీలు ఖర్చై బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిమ్మలోని పీచు పదార్థం వలన పొట్ట నిండుగా అనిపించి జంక్ ఫుడ్ లేదా ఆయిల్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. అరుగుదల మెరుగుపరుస్తుంది. అనారోగ్యాలు దరిచేరవు’ అని వివరిస్తున్నారు.

News October 7, 2024

వచ్చే ఏడాది మూడు చోట్ల బీచ్ ఫెస్టివల్: మంత్రి దుర్గేశ్

image

AP: రుషికొండ నిర్మాణాలను ఎలా హ్యండిల్ చేయాలో అర్థం కావడం లేదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. అవినీతి సామ్రాజ్యానికి సూచికగా రుషికొండలో మ్యూజియం ఏర్పాటు చేయాలేమోనని సెటైర్లు వేశారు. కొత్త టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోందన్నారు. దీనిలో భాగంగా స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీం రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాది విశాఖ, కాకినాడ, బాపట్లలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు.

News October 7, 2024

రుణమాఫీపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: హరీశ్ రావు

image

TG: రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. మాఫీ అమలు విషయంలో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలను నమ్మించేందుకు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్బీఐ డేటా ప్రకారం చాలా మందికి రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు ఆపి అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.