News June 13, 2024
గంగోత్రిలో గుత్తి వాసి మృతి

గుత్తికి చెందిన వ్యాపారస్థుడు శ్రీరామ్ సత్య ఆంజనేయులు(65) కేదార్నాథ్‌లో మృతి చెందాడు. గత నెల 25వ తేదీ సుమారు 40మంది కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్లారు. బుధవారం రాత్రి గంగోత్రిలో ఉన్న సమయంలో శ్రీరాం సత్య ఆంజనేయులుకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. దీంతో టూరిస్టులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Similar News
News September 14, 2025
లోక్‌సభ ర్యాంకిగ్స్‌లో అనంతపురం MPకి 8ర్యాంక్

లోక్‌సభలో MPల పెర్ఫామెన్స్ రిపోర్ట్‌ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లు ఇచ్చింది. ఈ నివేదికలో అనంతపురం MP అంబికా లక్ష్మీనారాయణ 8వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 78 ప్రశ్నలు అడగగా, 8 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 89.71గా ఉంది. ఆయన పనితీరుపై మీ కామెంట్..!
News September 14, 2025
వైద్యాధికారులతో అనంతపురం కలెక్టర్ సమావేశం

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్ ఆనంద్‌ను DMHO డాక్టర్ దేవి పుష్పగుచ్చంతో శనివారం స్వాగతించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్య అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అందుతున్న సేవలపై DMHOతో చర్చించారు. జిల్లాలో PHC, CHC, విలేజ్ హెల్త్ సెంటర్, క్లినిక్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News September 13, 2025
అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఆనంద్ శనివారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలకు సూచించారు.