News June 14, 2024
TODAY HEADLINES
* ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
* మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన CBN
* కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్
* వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు: మంత్రి నిమ్మల
* కూటమి విజయానికి పవనే కారణం: YCP ఎమ్మెల్సీ
* TG:రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు: CS శాంతి కుమారి
* పాఠ్యపుస్తకాల నుంచి కేసీఆర్ ఫొటో తొలగింపు సరికాదు: సబిత
Similar News
News January 15, 2025
తిరుమలలో రూ.300 టికెట్ల స్కామ్.. ఐదుగురు అరెస్ట్
AP: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన నకిలీ టికెట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ₹300 నకిలీ టికెట్లతో పలువురు దర్శనానికి వెళ్తుండగా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రత్యేక కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా ఈ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
News January 15, 2025
కర్ణాటక సీఎం: మార్చి తరువాత మార్పు?
CM సిద్ద రామయ్య త్వరలో తప్పుకుంటారని తెలుస్తోంది. మార్చిలో బడ్జెట్ అనంతరం DK శివకుమార్ CM పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. పవర్ షేరింగ్ ఫార్ములా ప్రకారం బాధ్యతల బదిలీ జరగనుందని తెలిసింది. అందుకే సిద్ద రామయ్య ఎంపిక చేసిన మంత్రులు, MLAలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారని సమాచారం. ఈ విషయమై పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడవద్దని అధిష్ఠానం ఇప్పటికే ఆదేశించింది.
News January 15, 2025
ఆతిశీ జింకలా పరిగెడుతున్నారు.. మళ్లీ నోరు జారిన బిధూరీ
ఢిల్లీ CM ఆతిశీ తన తండ్రినే మార్చేశారంటూ <<15102620>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన రమేశ్ బిధూరీ మరోసారి నోరు జారారు. ఆమె ఓట్ల కోసం ఢిల్లీ రోడ్లపై జింకలా పరిగెడుతున్నారని కామెంట్ చేశారు. నాలుగేళ్లలో ఆమె ఎప్పుడూ నగర సమస్యలను పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని రమేశ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.