News June 14, 2024

ప్రకాశం జిల్లాకు ఎన్ని టీచర్ పోస్టులో..?

image

గతంలో జగన్ DSC ద్వారా దాదాపు 6 వేల పోస్టులు ప్రకటించగా.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా మెగా DSC పేరిట CM చంద్రబాబు దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు. గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలకు పైగానే పెరిగింది. మరి తాజా నోటిఫికేషన్‌లో జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయిస్తారనేది త్వరలోనే తెలియనుంది.

Similar News

News September 13, 2025

ప్రకాశం జిల్లా SPగా హర్షవర్ధన్ రాజు

image

ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు శనివారం నియమితులయ్యారు. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న A.R దామోదర్‌‌ను విజయనగరంకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతి SPగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బదిలీ కాగా ఆమె స్థానంలో రాజాబాబు నియమితులై నేడే భాద్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

News September 13, 2025

రేగలగడ్డలో భార్యను చంపి, భర్త ఆత్మహత్యాయత్నం

image

మర్రిపూడిలోని రేగలగడ్డలో దారుణం జరిగింది. నారాయణ భార్య అంజమ్మను శుక్రవారం రాత్రి గొంతుకోసి చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంజమ్మ చనిపోగా.. నారాయణ కొన ఊపిరితో ఉన్నాడు. గ్రామస్థులు సమాచారం పోలీసులకు అందజేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 12, 2025

ప్రకాశం: బార్ల లైసెన్సులకు గడువు పొడిగింపు

image

ప్రకాశం జిల్లాలోని 4 ఓపెన్ కేటగిరి బార్ల లైసెన్సులకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 ఓపెన్ బార్ల లైసెన్స్‌ల కొరకు దరఖాస్తు గడువు గతంలో 14వ తేదీ వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ గడువు తేదీని 17 వరకు పొడిగించామన్నారు.