News June 14, 2024
స్వదేశానికి గిల్, అవేశ్.. జట్టుతో రింకూ, ఖలీల్

T20WC కోసం భారత జట్టుతో పాటు USAకు వెళ్లిన క్రికెటర్లు గిల్, అవేశ్ ఖాన్ స్వదేశానికి రానున్నారు. వీరితో పాటు ట్రావెలింగ్ రిజర్వ్‌గా వెళ్లి రింకూ, ఖలీల్ అహ్మద్ జట్టుతోనే ఉంటారు. USAలో జూన్ 15న కెనడాతో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది. తర్వాతి మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో జరుగుతాయి. జట్టులోని ఆటగాళ్లు గాయపడితే అప్పటికప్పుడు రిజర్వ్ ప్లేయర్లు USAకు వెళ్లడం కష్టమైన పని కావడంతో వీరిని ముందే USAకు తీసుకెళ్లారు.
Similar News
News March 3, 2025
ఎమ్మెల్యే కోటా.. 10 MLC స్థానాలకు నేడు నోటిఫికేషన్

APలో 5, TGలో 5 MLC స్థానాలకు(MLA కోటా) నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేయొచ్చు. 11న పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. మార్చి 20న ఉ.9 నుంచి సా.4 వరకు అసెంబ్లీలో పోలింగ్, అదే రోజు సా.5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా APలో ఖాళీలకు TDP నుంచి జవహర్, వంగవీటి రాధా, SVSN వర్మ, JSP నుంచి నాగబాబు, BJP నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు సమాచారం.
News March 3, 2025
7న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 7న సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను ఈ నెల 5లోగా పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున కీలక పథకాలు, ప్రాజెక్టుల అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
News March 3, 2025
ఇవాళ ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

TG: MLC ఎన్నికలు జరిగిన ఉమ్మడి మెదక్, కరీంనగర్, ADB, నిజామాబాద్, NLG, WGL, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ కౌంటింగ్ జరగనుంది. దీంతో ఆయా జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. పలుచోట్ల సెలవు ఇవ్వలేదని విద్యార్థులు, పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అటు ఏపీలో అవసరమైతేనే సెలవు ఇవ్వాలని EC ఆదేశించింది. దీంతో కౌంటింగ్ జరిగే చోటే సెలవు ఉండే ఛాన్సుంది.