News June 14, 2024

70ఏళ్ల ‘పాలకొల్లు’ చరిత్రలో ‘నిమ్మల’ సరికొత్త రికార్డ్

image

70ఏళ్ల చరిత్ర గల పాలకొల్లు నియోజకవర్గంలో డా.నిమ్మల రామానాయుడు కొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇక్కడ 1955 నుంచి ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరగ్గా.. ఓటర్లు నిమ్మలకు మాత్రమే ‘హ్యాట్రిక్’ ఇచ్చారు. 1983, 85తో పాటు 1994, 99 ఎన్నికల్లో వరుసగా అల్లు వెంకటసత్యనారాయణ గెలిచినా.. హ్యాట్రిక్ సాధ్యం కాలేదు. 3వసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2014, 19లో గెలిచిన నిమ్మల ఈసారి హ్యాట్రిక్ కొట్టి మంత్రి పదవి చేపట్టారు.

Similar News

News November 5, 2025

మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన “కౌశలం” సర్వేలో భాగంగా ఈనెల 6న నిర్వహించే మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లో వెబ్ క్యామ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వే ద్వారా 1,09,347 మందిని గుర్తించి, 535 సెంటర్లలో ఈ మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తామని బుధవారం ఆమె మీడియాకు వెల్లడించారు.

News November 5, 2025

‘గర్భగుడి వద్ద చెప్పులు’ ఘటనపై విచారణ చేస్తున్నాం: ఈఓ

image

పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం గర్భగుడి వద్దకు చెప్పులు తీసుకెళ్లిన ఘటనపై ఈఓ శ్రీనివాసరావు స్పందించారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువ ఉందని ఆ హడావిడిలో ఒక అజ్ఞాత వ్యక్తి గర్భగుడి గుమ్మం బయట చెప్పులను వదిలి వెళ్లాడని, వెంటనే సిబ్బంది ఆ చెప్పులను తొలగించారన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, బాద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News November 5, 2025

నరసాపురం: నేషనల్ లాన్ టెన్నిస్ పోటీలకు ఏంజిలిన్ ఎంపిక

image

నరసాపురానికి చెందిన గోడి స్పార్క్ ఏంజిలిన్ జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ క్రీడా పోటీలకు ఎంపికైంది. ఈ నెల 3న శ్రీకాళహస్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి 14 ఏళ్ల లోపు బాలికల టెన్నిస్ విభాగంలో ఏంజిలిన్ మూడో స్థానం సాధించింది. దీంతో డిసెంబరులో హర్యానా రోహతక్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె అర్హత సాధించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం, క్రీడాభిమానులు అభినందించారు.