News June 14, 2024
ఉమ్మడి తూ.గో జిల్లాలో 60వేల మంది రక్తదాతలు
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 60,000 మంది రక్తదాతలు ఆపద సమయంలో పలువురుకి అండగా నిలుస్తూ ఔదార్యం చూపుతున్నారు. నెలకు సుమారు 5000 యూనిట్ల రక్తం దానం చేస్తున్నారు. జిల్లాల వారీగా దాతలు ఇలా..
☞ కాకినాడ- 22,500 మంది
☞ తూర్పు గోదావరి- 19,000 మంది
☞ అంబేడ్కర్ కోనసీమ- 18,500 మంది
➠ ఈ మూడు జిల్లాల్లో 23 బ్లడ్ బ్యాంకుల ద్వారా రక్తం సేకరిస్తున్నారు.
Similar News
News November 26, 2024
IPL: కాకినాడ కుర్రాడికి సువర్ణావకాశం
ఐపీఎల్లో ముంబై టీమ్ కొనుగోలు చేసిన కాకినాడ కుర్రాడు సత్యనారాయణరాజు రోహిత్, బుమ్రా, హార్దిక్, బోల్ట్ వంటి స్టార్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నారు. వారి అనుభవాలను తెలుసుకుని కెరీర్‌ను పటిష్ఠం చేసుకునే సువర్ణావకాశం మన జిల్లా కుర్రాడికి దక్కింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే TEAM INDIA ఎంట్రీకి ఇదే తొలి అడుగు అవుతుందనడంలో సందేహం లేదు. దీనిపై మీ కామెంట్..
News November 26, 2024
కత్తిపూడిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
శంఖవరం మండలం సీతంపేటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపుగా వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో మినీ వ్యాన్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు ఘటన స్థలానికి అన్నవరం SI శ్రీహరిబాబు చేరుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 25, 2024
యువత భవితకు భరోసాగా నిలబడతాం: మంత్రి లోకేశ్
మంత్రి లోకేశ్‌ను కలిసే అవకాశం దక్కాలని విజయవాడ ఇంద్రకీలాద్రిని మోకాలిపై ఎక్కి అమ్మవారిని దర్శించుకున్న రామచంద్రపురం మండలం చౌడవరం వాసి సాయికృష్ణని లోకేశ్ సోమవారం కలిశారు. ‘అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. వైసీపీ అరాచక పాలనపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడిన తనను ఇబ్బందులు పెట్టారు. యువత భవితకు భరోసాగా నిలబడతానని అతనికి హామీ ఇచ్చా’ అని లోకేశ్ ‘X’లో పేర్కొన్నారు.