News June 14, 2024
‘ఆడుదాం ఆంధ్ర’లో రోజా రూ.100 కోట్ల దోపిడీ: ఆత్యా-పాత్యా నేతలు
AP: వైసీపీ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా ఉన్న RK రోజా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆత్యా-పాత్యా సంఘం నేతలు CID ఫిర్యాదు చేశారు. ఆమెతోపాటు శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని కూడా విచారించాలని CIDని కోరారు. గత ఐదేళ్లలో పనిచేసిన శాప్ MDలు, DSDOలపై కూడా విచారణ చేయాలని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా కింద పలు విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందినవారిని విచారించాలన్నారు.
Similar News
News December 25, 2024
కపిల్ దేవ్‌ను తప్పుబట్టిన అశ్విన్
తన చేతిలో విషయమైతే అశ్విన్‌ను అలా సాదాసీదాగా రిటైర్ కానిచ్చేవాడిని కానని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల్ని అశ్విన్ తప్పుబట్టారు. ఫేర్‌వెల్ మ్యాచులనేవి తనకు నచ్చవని స్పష్టం చేశారు. అవి సెలబ్రిటీ సంస్కృతిలో భాగమన్నారు. ‘నాకోసం ఎవరైనా ఒక చుక్క కన్నీరు కార్చినా నాకిష్టం ఉండదు. ఒకరి ఘనతల్ని చూసి స్ఫూర్తి పొందొచ్చు. అంతే తప్ప ఆ ఘనతల వెనక పడకూడదు’ అని పేర్కొన్నారు.
News December 25, 2024
అమిత్ షా, నిర్మలతో చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయిన ఆయన కాసేపటి క్రితం కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఇవాళ్టితో బాబు హస్తిన టూర్ ముగిసింది. రేపు ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే మంత్రి టీజీ భరత్ కూతురు వివాహానికి హాజరవుతారు.
News December 25, 2024
రామ్‍చరణ్ దంపతుల క్రిస్మస్ వేడుకలు
సెలబ్రిటీలు క్రిస్మస్‌ను కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిందే. నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రం తమ సిబ్బందితో పండుగ వేడుకలు చేసుకున్నారు. వీరిలో వారి ఇంటి సిబ్బందితో పాటు అపోలో సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. తమ వద్ద పనిచేసేవారికీ పండుగను సెలబ్రేట్ చేయడం గ్రేట్ అంటూ మెగా ఫ్యాన్స్ వారిని కొనియాడుతున్నారు.