News June 14, 2024
జులై 22న పూర్తి స్థాయి బడ్జెట్?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. అదే రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 9 వరకు కొనసాగనున్నాయట. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
Similar News
News January 8, 2026
జగన్ రాజధాని కామెంట్లపై మంత్రి కౌంటర్

AP: రాజధాని అమరావతిపై జగన్ మరోసారి విషం కక్కుతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. కేంద్రం, ఆర్థిక సంస్థలకు తెలియని విషయాలు తెలుసా అని నిలదీశారు. ‘అమరావతిపై తప్పుగా అర్థం చేసుకున్నామని అధికారం కోల్పోయాక జగన్ అన్నారు. ఇప్పుడు CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటున్నారు. నదీ గర్భంలో ఉందంటున్నారు. జగన్ హయాంలోనే రూ.12,700కోట్లు ట్రూఅప్ ఛార్జీలు వేయాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి’ అని పార్ధసారథి చెప్పారు.
News January 8, 2026
ఇతిహాసాలు క్విజ్ – 121 సమాధానం

ఈరోజు ప్రశ్న: ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు కావడానికి గల కారణం ఏంటి?
సమాధానం: హస్తినాపుర వంశాభివృద్ధి కోసం వ్యాసమహర్షి అంబిక వద్దకు వెళ్లారు. ఆయన తపశ్శక్తితో కూడిన భయంకర రూపాన్ని చూసి అంబిక భయంతో కళ్లు మూసుకుంది. తల్లి చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల, ఆమెకు పుట్టిన కుమారుడు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడయ్యాడు. ఆమె కళ్లు మూసుకోవడమే అతడి దృష్టిలోపానికి ప్రధాన కారణమైంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 8, 2026
ప్రసారభారతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


