News June 14, 2024

ప్రమాదకరంగా కడప-చెన్నై రహదారిలోని బ్రిడ్జ్

image

ఒంటిమిట్ట బస్టాండ్ సమీపంలోని శ్రీరామ నగర్ మలుపు వద్ద ఉన్న కడప-చెన్నై ప్రధాన రహదారి బ్రిడ్జికి పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి బ్రిడ్జికి మరమ్మతులు చేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వేళ ఈ బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడితే కడప నుంచి రాజంపేట, కోడూరు, తిరుపతి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోతాయి.

Similar News

News October 2, 2024

కడప జిల్లాలో 581 మంది బైండోవర్

image

కడప జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరులో అసాంఘిక కార్యకలాపాలపై ముమ్మరంగా దాడులు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 141 కేసుల్లో 581 మందిని బైండోవర్ చేశామన్నారు. మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేసి 204 లీటర్ల మద్యాన్ని స్వాధీనపరచుకుని, 37 మందిని అరెస్టు చేశామన్నారు. 67 మంది మట్కా నిర్వాహకులను అరెస్టు చేసి, రూ.5.96 లక్షలు, 382 మంది జూదరులను అరెస్టు చేశామని తెలిపారు.

News October 2, 2024

రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ మానవుడిగా పుట్టినందుకు రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. జాతీయ స్వచ్ఛంద దాతల దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వ రక్తనిధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం, మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొన్నారు.

News October 2, 2024

జాతీయ సేవకులకు వైవీయూ పురస్కారాలు

image

కడప యోగి వేమన విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి యూనివర్శిటి స్థాయి జాతీయ సేవా పథక పురస్కారాలను ప్రకటించింది. సమాజ సేవా, ప్రజా చైతన్యం, జాతీయ సమైక్యత వంటి కార్యక్రమాలలో విశేష కృషిచేసిన ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు, ప్రోత్సాహక అందించిన కళాశాలల జాబితాను వీసీ ప్రొ. కె.కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ. ఎస్. రఘునాథ రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా.వెంకట్రామిరెడ్డి విడుదల చేశారు.