News June 14, 2024
ఈ బాలికలను చూస్తుంటే సంతోషంగా ఉంది: CM రేవంత్
TG: ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో బాలికలు పాఠశాలకు వెళ్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘సిద్దిపేట జిల్లా మగ్దుంపూర్ పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలు ఊరికి కి.మీ. దూరంలో ఉన్న స్కూలుకు రూపాయి ప్రయాణఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నామని ఆధార్ కార్డులు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని సీఎం పేర్కొన్నారు.
Similar News
News December 26, 2024
క్రిస్మస్‌కు పోప్ ఫ్రాన్సిస్ సందేశమిదే
క్రిస్మస్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచానికి తన సందేశాన్ని అందించారు. ప్రజలు విద్వేషాలకు వ్యతిరేకంగా గొంతెత్తాలని, ధైర్యాన్ని పుంజుకోవాలని ఆయన కోరారు. ‘రేపటిపై ఆశతో జీవించాలని కోరుతున్నాను. ఉక్రెయిన్, పశ్చిమాసియా, గాజా, లెబనాన్, సిరియా వంటి ప్రాంతాలన్నింటిలోనూ ఆయుధాలను పక్కన పెట్టండి. దయచేసి శాంతిని స్వీకరించండి. ఎంతోమంది పిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారు’ అని సందేశాన్నిచ్చారు.
News December 26, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 26, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
✒ తేది: డిసెంబర్ 26, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.14 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.