News June 14, 2024

ఆన్‌లైన్‌ గేమింగ్ జీఎస్‌టీపై కేంద్రం సమీక్ష!

image

ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% పన్ను విధించడాన్ని GST కౌన్సిల్ ఈనెల 22న జరిగే సమావేశంలో పునఃపరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పలు వస్తువులకు విధించే ఇన్వర్టెడ్ ట్యాక్స్ విధానంపైన ఫిట్‌మెంట్ కమిటీ సూచనలను సమీక్షించనున్నట్లు సమాచారం. కాగా 2023 అక్టోబరు 1న ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% GSTని కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. ఆరునెలలు దాటడంతో ముందుగా అనుకున్నట్టు కౌన్సిల్ దానిని పరిశీలించనుంది.

Similar News

News September 13, 2025

రివర్స్ కండీషనింగ్ గురించి తెలుసా?

image

సాధారణంగా తలస్నానం చేశాక కండీషనర్ రాస్తారు. కానీ ముందుగా కండీషనర్‌ అప్లై చేసి, తర్వాత షాంపూతో హెయిర్ వాష్ చేసే ప్రక్రియను రివర్స్ కండీషనింగ్ అంటారు. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ టెక్నిక్ స్కాల్ప్‌ను క్లీన్ చేసి జుట్టును హెల్తీగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అలాగే కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. దీనికోసం సల్ఫేట్‌లు, పారాబెన్‌, సిలికాన్‌ లేని మాయిశ్చరైజింగ్ కండీషనర్‌ను ఎంచుకోవాలి.

News September 13, 2025

తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు

image

తిరుపతి వేదికగా ఈనెల 14, 15 తేదీల్లో మహిళా సాధికారత జాతీయ సదస్సు జరగనుంది. తిరుచానూరులోని రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. దేశం నలుమూలల నుంచి 250 మందికిపైగా మహిళా ప్రతినిధులు వస్తున్నారు. ఇందులో మహిళా రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక సాధికారత-పెరుగుతున్న అవకాశాలు, ‘నాయకత్వం, చట్టాల్లో మహిళల పాత్ర’పై వక్తలు ప్రసంగించనున్నారు.

News September 13, 2025

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. విజిలెన్స్‌కు ACB రిపోర్ట్

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నివేదికను ఏసీబీ విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించింది. రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి రిపోర్ట్ చేరుతుంది. ఐఏఎస్ అధికారి అరవింద్, బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్‌పై తుది నివేదిక వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించే అవకాశముంది.