News June 14, 2024

కాలు విరిగితే అట్టముక్క కట్టారు!

image

కాలు విరిగిందని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన ముకేశ్ కుమార్ అనే వ్యక్తి అక్కడి వైద్యులు చేసిన చికిత్సకు నిర్ఘాంతపోయాడు. ఫ్రాక్చర్ అయిన కాలుకు అట్టముక్క కట్టి పంపించారు. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ పరిధిలోని మినాపూర్‌లో ఈనెల 7న జరిగింది. ఇక్కడి వైద్యం నచ్చక శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ అనే మరో చోట చూపించుకున్నాడు. అయితే వారు కూడా ఈ కార్డ్‌బోర్డ్ తీయకుండానే ఈనెల 7-11 మధ్య చికిత్స అందించడం కొసమెరుపు.

Similar News

News February 10, 2026

UPSC 2026: మళ్లీ మళ్లీ రాయడంపై పరిమితులు

image

UPSC 2026 నోటిఫికేషన్‌లో ఈసారి కీలక మార్పులు ఉన్నాయి. IAS, IFS ఆఫీసర్లు మళ్లీ ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. IPSలు ఎగ్జామ్ రాయొచ్చు. కానీ మళ్లీ IPS ఆప్షన్ ఎంచుకోలేరు. గ్రూప్-A సర్వీస్ వాళ్లకు ఇంప్రూవ్‌మెంట్ కోసం ఒకే ఒక్క ఛాన్స్ (2027లో) ఉంటుంది. వీళ్లు ఫౌండేషనల్ కోర్సు నుంచి ఏడాది మినహాయింపు కోరుతూ పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే సర్వీస్ క్యాన్సిలవుతుంది. 2027లోనూ ఎంపికైతే నచ్చిన సర్వీస్‌లో కొనసాగొచ్చు.

News February 10, 2026

ఇదేం పని: బాయ్‌ఫ్రెండ్‌కు తల్లి, పెద్దమ్మ ప్రైవేట్ ఫొటోలు!

image

ప్రేమ మోజులో ఈకాలం పిల్లలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. బెంగళూరుకు చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఏకంగా సొంత తల్లి, పెద్దమ్మ ప్రైవేట్ ఫొటోలు పంపడం అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. ఆన్‌లైన్ క్లాసుల కోసం కొనిచ్చిన ఫోన్‌తో గంటల తరబడి మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. మందలించి ఫోన్ చెక్ చేయగా విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News February 10, 2026

SBI 256 పోస్టులకు నోటిఫికేషన్

image

<>SBI <<>>256 FLC కౌన్సిలర్స్, FLC డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు ఫిబ్రవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 60 నుంచి 63ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in