News June 14, 2024

చట్టానికి ఎవరూ అతీతులు కాదు: నటి రమ్య

image

హత్య కేసులో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ అరెస్ట్‌పై మరో కన్నడ నటి రమ్య స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ‘కర్ణాటక పోలీసులు రాజకీయ ఒత్తిడులకు లొంగిపోరు. చట్టంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. జస్టిస్ ఫర్ రేణుకాస్వామి’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా పవిత్రకు రేణుకాస్వామి అసభ్యకర సందేశాలు పంపడంతో అతడిని దర్శన్ కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

Similar News

News February 4, 2026

మున్సిపల్ ఎన్నికలు.. ఆ రెండు రోజులు సెలవు?

image

TG: రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికలు జరగనున్న ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఓటు వేసేందుకు వీలుగా అక్కడి కంపెనీల్లోని ఉద్యోగులు, సిబ్బందికి కూడా హాలిడే ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కౌంటింగ్ జరిగే 13న కూడా సెలవు ఉంటుందని సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

News February 4, 2026

హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్

image

భారత ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇటలీకి చెందిన ప్రఖ్యాత హెలికాప్టర్ల తయారీ సంస్థ లియోనార్డ్‌తో అదానీ గ్రూప్ జతకట్టింది. దేశీయంగా హెలికాప్టర్ల తయారీ ఎకోసిస్టం ఏర్పాటుకు సంబంధించి అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌, లియోనార్డ్‌ కంపెనీల ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. భారత సైన్యం, వైమానిక దళాల అవసరాలను తీర్చడమే ఈ డీల్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

News February 4, 2026

ఆత్మవిశ్వాసానికి సంకేతం ‘మణిపూరక చక్రం’

image

బొడ్డు భాగంలో ఉండే ఈ చక్రం ఆత్మవిశ్వాసానికి సంకేతం. ఇది సమతుల్యంగా ఉంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, నాయకత్వ లక్షణాలు, మంచి జీర్ణక్రియ కలుగుతాయి. ఇది అస్థిరంగా మారితే అజీర్తి, షుగర్, ఎదుటివారిపై అధికారం చెలాయించే స్వభావం పెరుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘రం’ మంత్రాన్ని ధ్యానించాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం, సూర్యరశ్మిలో గడపడం, యోగ, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఈ చక్రాన్ని మేల్కొల్పవచ్చు.