News June 14, 2024

హోంమంత్రిగా అనిత

image

ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనితను CM చంద్రబాబు నియమించారు. పాయకరావు పేట నుంచి గెలిచిన అనిత ప్రస్తుత కేబినెట్‌లో సీనియార్టీ, SC వర్గ సమీకరణాలతో మంత్రి పదవి పొందారు. కీలకమైన హోంశాఖను ఎవరూ ఊహించని విధంగా అనిత పొంది అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా గత ప్రభుత్వంలోనూ జగన్ ఇదే దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళలకే (తానేటి వనిత, మేకతోటి సుచరిత) ఈ శాఖను అప్పగించడం గమనార్హం.

Similar News

News January 16, 2025

నిరాధార ప్రచారం నమ్మొద్దు: బుమ్రా

image

తనకు గాయమైందని జరుగుతున్న ప్రచారంపై స్టార్ బౌలర్ బుమ్రా క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, అదంతా నిరాధార ప్రచారమని ట్వీట్ చేశారు. ఇలాంటివి నవ్వు తెప్పిస్తాయన్నారు. BGTలో సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా అతడు అర్ధంతరంగా మైదానాన్ని వీడారు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఆయనకు విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో బుమ్రా గాయం నుంచి కోలుకోలేదని CTకి దూరమవుతారని ప్రచారం జరిగింది.

News January 16, 2025

సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ సభ: మహేశ్ కుమార్

image

TG: ఫిబ్రవరి రెండో వారంలోపు సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. రాహుల్ తెలంగాణ టూర్‌, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇవాళ ఆయన ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. క్యాబినెట్ విస్తరణపై పార్టీ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని మహేశ్ వెల్లడించారు.

News January 16, 2025

పుష్ప-3 అప్డేట్ చెప్పిన DSP

image

పుష్ప-3 కోసం సుకుమార్ నిరంతరం పనిచేస్తున్నారని DSP వెల్లడించారు. స్టోరీపై రీవర్క్ కూడా జరుగుతోందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పుష్ప-2లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. ప్రతి టెక్నీషియన్ బాగా కష్టపడ్డారు. వర్క్ విషయంలో నేనెప్పుడూ టెన్షన్ పడను. ఒత్తిడికి గురైతే క్రియేటివిటీ ఉండదు. సుకుమార్ విజన్, ఆయన స్టోరీలు మాకు స్ఫూర్తి. రెండు పార్టుల కోసం కష్టపడినట్లుగానే పుష్ప-3 కోసం పనిచేస్తాం’ అని తెలిపారు.